Collector Office Nizamabad: నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 12 (ప్రజా శంఖారావం): మ అభివృద్ధి కోసం మంజూరైన నిధులను అభివృద్ధి పనుల కోసం వినియోగించకుండా ఆ గ్రామ మాజీ సర్పంచ్ తన స్వలాభం కోసం వినియోగించి నిధుల దుర్వినియోగానికి పాల్గొనడంపై గ్రామ సర్వసమాజ్ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మాజీ గ్రామ సర్పంచ్ పై ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సల్లపల్లి సవిత గణేష్ పై నిధుల దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రామ అభివృద్ధి కోసం మంజూరైన నిధులను పనులు చేయకుండానే ఎంబి రికార్డులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభివృద్ది పనులు చేయకపోయినా చేసినట్లు ఎంబి రికార్డులు చేసిన అధికారులపై, సదరు కాంట్రాక్టర్ పై సముగ్ర విచారణ చేసి దర్యాప్తు చేయాలని కోరారు.
గ్రామంలోని సిసి రోడ్ల పనుల నిమిత్తం 2021- 22 సంవత్సరంలో 15 లక్షల రూపాయలు సిసి రోడ్లకు మంజూరయ్యాయని, ఎస్డిఎఫ్ నిధులలో భవన నిర్మాణం కోసం 77 లక్షలు, 2019 – 2020 సంవత్సరానికి ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కింద 10 లక్షలు మంజూరు కాగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు చేసి నిధుల దుర్వినియోగానికి మాజీ సర్పంచ్ పాల్పడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్వ సమాజ్ అధ్యక్షులు దాసరి వెంకటరామ్, ఉపాధ్యక్షులు రాటం రమేష్, పల్లికొండ గణేష్, గడ్డి ఎర్రయ్య, అబ్బరాజు, కంచు రాజు, కుడుకల నరహరి, సట్లపడి భాస్కర్, రాపోలు పోశెట్టి, బండి సాయన్న తదితరులు పాల్గొన్నారు