MLC KAVITHA: (ప్రజా శంఖారావం) డెస్క్, ఆగస్టు 12: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత గడిచిన ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆరోగ్య కారణాల రిత్యా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె తరపు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథుల నేతృత్వంలోని ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో కవిత తరపు న్యాయవాదులకు, ఆమెకు మళ్ళీ చుక్కెదురైనట్లుంది.
ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయమని ధర్మాసనం తెలిపింది. ప్రతివాదులైన దర్యాప్తు సంస్థలు సిబిఐ లకు కౌంటర్ దాఖలు చేయాలంటూ ధర్మాసరం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున లాయర్ రోహిత్ దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని కేసును వెంటనే విచారణ చేపట్టాలని, లేనిపక్షంలో సోమవారం విచారించే విధంగా చూడాలంటూ ధర్మాసనాన్ని కోరారు.
ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ కేసులో 493 మంది సాక్షులకు విచారణ జరిగిందని, మహిళ ఉన్న ఆమెకు సెక్షన్ 45 ప్రకారం మద్యంతల బెయిల్ కు అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నెల మళ్లీ 20న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్టు చేయగా, అప్పటి నుండి ఆమె జ్యుడీషియల్ రిమాండ్ లో తీహార్ జైల్లోనే ఉంటున్నారు.