Aadhaar Card: మనదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి చాలా కీలకమైన గుర్తింపు కార్డు. ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి బ్యాంకులో ఖాతా తెరవడం, సిమ్ కార్డు పొందడం, గుర్తింపు ధ్రువీకరణ పొందడం వంటి అనేక పనులకు కూడా ముఖ్యంగా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. జూన్ 14 2025 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రతి ఒక్కరు ఆధార్ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును అందించింది.
గతంలో డిసెంబర్ 14, 2024 వరకు మాత్రమే ఈ గడువు ఉండేది. కేవలం ఆన్లైన్లో మాత్రమే మీరు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. జూన్ 14, 2025 తర్వాత మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి రుసుము చెల్లించాల్సి ఉండొచ్చు. మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి UIDAI అధికారిక వెబ్సైట్లో లేదా మై ఆధార్ పోర్టల్ కి వెళ్ళండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి ద్వారా లాగిన్ అవ్వండి. అక్కడ అప్డేట్ యువర్ ఆధార్ అనే ఆప్షన్ను ఎంచుకున్న తర్వాత మీరు మార్చాలి అనుకుంటున్నా వివరాన్ని ఎంచుకోండి. అందులో మీరు మార్చాలి అనుకుంటున్నా దానికి సంబంధించిన గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఆ కాపీలను అందులో అప్ లోడ్ చేయండి.
పూర్తి వివరాలను ఎంటర్ చేసిన తర్వాత సమర్పించండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఇస్తారు. దీనిని ఉపయోగించి మీ అభ్యర్థన స్థితిని ట్రాక్ చేయవచ్చు. మీ డాక్యుమెంట్లను UIDAI లో ధ్రువీకరించిన తర్వాత మీరు అందించిన ఆధార్ వివరాలు అప్డేట్ అవుతాయి. మై ఆధార్ పోర్టల్ నుంచి మీరు మీ అప్డేట్ చేయబడిన ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.