Grain: కొనుగోలు కేంద్రాలలో మొలకెత్తిన ధాన్యం బస్తాలు

Grain: మెట్ పల్లి, మే 24 (ప్రజా శంఖారావం): గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఆరుగాలం పoడించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రలలో మొలకెత్తి అన్నదాతలు అరి గోసలు పడుతున్నారు. మెట్ పల్లి పట్టణంలోని రేగుంట శివారులో రైతు సహకార సమితి ఆధ్వర్యంలో ఏర్పరిచిన కేంద్రంలో గడిచిన 20 రోజుల నుండి తూకం వేసిన వరి బస్తాలను తరలించడంలో అధికారుల జాప్యంతో సంచులలో ధాన్యం తడిసి మొలకెత్తిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి మొలకేత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now