Death of a government employee: ఆర్మూర్, అక్టోబర్ 17 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్ర పల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 63 పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ కు చెందిన పుచ్చుల సుమన్ (35) ఘటన స్థలంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తూనికలు కొలతల శాఖలో గడిచిన 5 నెలల క్రితం. మృతుడు ఉద్యోగంలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతుని తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమాండ్లు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కారుణ్య నియామకంలో భాగంగా మృతునికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆర్మూర్ పట్టణము నుండి నిజామాబాద్ కు ప్రతినిత్యం ఉద్యోగరీత్యా వెళుతూ వస్తున్న క్రమంలో రామచంద్ర పల్లి జాతీయ రహదారి వద్ద వెనుక నుండి వచ్చిన కారు మృతుడు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో రోడ్డు పక్కన ఆరబోసిన వరికుప్పలపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.