Arrested for playing Poker: ఆర్మూర్, అక్టోబర్ 31 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలోని గురడి కాపు కళ్యాణ మండపంలో పేకాట ఆడుతున్న 7గురిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ సిఐ అంజయ్య గురువారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. కల్యాణ మండపంలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసినట్లు చెప్పారు.
పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి ₹ 59,260/- రూపాయలతో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నమన్నారు. జిల్లా ఇన్చార్జి సిపి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వుల మేరకు సిసిఎస్ ఏసిపి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిని ఆర్మూర్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now
















