IPL: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో క్రికెట్ ఆడించడం సరికాదని, ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమని ప్రకటించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడం చాలా కష్టమని చెప్పిన బీసీసీఐ ప్రస్తుతానికి ఐపీఎల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మరో షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
పాకిస్థాన్, ఇండియా బోర్డర్ లో నెలకొన్న టెన్షన్ ల మధ్య నిన్న రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచును అర్థంతరంగా ఆపేశారు. పాకిస్థాన్ మిస్సైళ్లలో రాత్రి భీకర దాడులకు ప్రయత్నించడంలో ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ఇండియాలోని దాదాపు 15 పట్టణాలను టార్గెట్ చేసుకుని దాడులు చేపట్టింది. దీంతో ధర్మశాలలో మ్యాచును అర్థంతరంగా ఆపేసి ప్రేక్షకులను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇరు జట్ల ఆటగాళ్లను సేప్ ప్లేస్ లో ఉంచారు. వీరిని ఢిల్లీ పంపించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇప్పటికే ధర్మశాల విమానాశ్రయం మూసేయడంతో ఆటగాళ్లను ఢిల్లీకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచిన ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీకి పంపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఐపీఎల్ ప్రస్తుతం ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. పాయింట్ల టేబుల్స్ లో ఆర్సీబీ 16 పాయింట్లు, గుజరాత్ 16 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉండగా.. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇంకా ఒక్కో జట్టు దాదాపు రెండు నుంచి మూడు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.