Garuda Puran: గరుడ పురాణంలో చెప్పినట్లు.. ఈ 4 పనులతో మీ రోజును మొదలు పెడితే చాలా లాభాలు

Garuda Puran
Garuda Puran

Garuda Puran: హిందూ పురాణాలలో ప్రతిరోజు మనిషి జీవించే విధానం గురించి చాలా విషయాలు ఉన్నాయి. హిందూ పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ పురాణానికి అధినేత అయిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణంలో మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసే పనులను మాత్రమే కాకుండా ఆ పనుల వలన ఆ మనిషి చనిపోయిన తర్వాత జీవి చేసే యాత్ర గురించి కూడా తెలియజేస్తుంది. ఈ పురాణంలో నియమాల గురించి మాత్రమే కాకుండా విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి అని చెప్పొచ్చు. ఈ పురాణం ప్రకారం మనిషి ప్రతిరోజు కొన్ని నియమాల ప్రకారం రోజున ప్రారంభించినట్లయితే అన్ని పనులలో విజయం సాధిస్తారు అని తెలుపబడింది. హిందూ మత శాస్త్రంలో గరుడ పురాణానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది.

18 మహాపురాణాలలో ముఖ్యమైన పురాణంగా గరుడ పురాణాన్ని పరిగణిస్తారు. విజయవంతమైన మనిషి జీవిత సారాంశం ఇందులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పురాణాన్ని పారాయణం చేయడం వలన అనేక విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇందులో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలి. అయితే సాధారణ ప్రజలలో దీని గురించి ఒక నమ్మకం ఉంది. చాలామంది ఇంట్లో ఎవరైనా మరణించిన సమయంలో మాత్రమే దీనిని చదవాలి అని చెప్తుంటారు. ప్రధానంగా ఇది మూడు భాగాలుగా ఉంటుంది.

గరుడ పురాణంలో ఉన్న మొదటి భాగం ఆచారఖండం లేదా పూర్వఖండం ఎప్పుడైనా సరే ఇంట్లో పటించవచ్చు. దీని మొదటి భాగంలో విశ్వం మూలం, 12 ఆదిత్యుల కథ, గ్రహాల మంత్రాలు, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, త్యాగం, దానం, మంచి ప్రవర్తన, తపస్సు, తీర్థయాత్ర, జపం వంటి అనేక లౌకిక మరియు అతింద్రియ విషయాల గురించి చెప్పబడింది. అలాగే ఈ పురాణం మొదటి భాగంలో వ్యాకరణం, పద్యం, అచ్చులు, జ్యోతిష్య శాస్త్రం, రత్నసారం, ఆయుర్వేదం వంటి మొదలైన అంశాలు కూడా చేర్చబడ్డాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now