Birds: ఇంట్లో పక్షి గూడు కడితే ఏమవుతుందో తెలుసా.. లాభామా లేదా నష్టామా.. తెలుసుకోండి

Birds
Birds

Birds: ప్రకృతి మనిషి జీవితానికి సంబంధించి చాలా సంకేతాలను అందజేస్తుంది. ఇటువంటి వాటిలో పక్షుల పాత్ర చాలా కీలకమైనది. జ్యోతిషా శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం పక్షులు మంచి శక్తులు అలాగే చెడు శక్తులకు ప్రతికలుగా ఉంటాయి. అయితే చాలామంది ఇళ్లలో పక్షులు గూడు కట్టుకుంటాయి. ఈ విధంగా పక్షులు ఇంట్లో కనిపించడం మంచిదా కాదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇవి కొన్ని సందర్భాలలో శుభం అని చెప్పవచ్చు. అలాగే మరికొన్ని సందర్భాలలో ఇవి అపశకునం అని కూడా భావిస్తారు. శగుణ శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం శుభప్రదమైనదిగా భావిస్తారు.

పక్షులు గుడి వేసిన ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుందని నమ్మకం. తమ గూడు కట్టుకోవడానికి పక్షులు ఎంచుకునే స్థలం చాలా శుభ శక్తులతో నిండినదిగా అలాగే సురక్షితంగా ఉంటుందని విశ్వసిస్తారు. ఈ క్రమంలో ఇంట్లో పక్షులు గూడుకట్టుకోవడానికి ఆశ్రయించే స్థలం గా మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఉండే సూచనగా కూడా భావిస్తారు. పక్షి ఇంట్లో గుడ్లు పెడితే చాలా అదృష్టం కలుగుతుందని చెప్తారు. ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు. పక్షి గుడ్లు పెట్టిన చోట మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.

మన పంచాంగాలలో కూడా పిట్టలు చాలా శుభసూచికంగా చెప్పబడ్డాయి. పిట్టా ఇంట్లో గుడ్లు పెట్టినట్లయితే ఆ కుటుంబంలో సౌభాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్థికపరంగా చాలా లాభాలు కలుగుతాయి. ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం కూడా పెరుగుతుంది. పక్షుల మాదిరిగానే గబ్బిలాలు కూడా ఇళ్లలో గూడు కట్టుకుంటాయి. కానీ ఇది మంచి శకునం కాదు అని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో గబ్బిలాలు గుడి కట్టుకుంటే అవి దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. బలహీన సంకల్పానికి ప్రతీకగా గబ్బిలం చెప్తారు. ఇటువంటి గబ్బిలాలు ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే ఆ కుటుంబంలో తేడాలు, గొడవలు జరుగుతాయి అని నమ్ముతారు. ఇంట్లో తేనెటీగలు గూడు కట్టడం కూడా శుభసూచికంగా చెప్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now