Weekly Horoscope: ఈవారం జూన్ 1, 2025 నుంచి జూన్ 8 2025 వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: కొన్ని ముఖ్యమైన పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. సన్నిహితుల సలహాలను పాటిస్తారు. ముఖ్య విషయాలపై చర్చలు ఫలితాలను ఇస్తాయి. ప్రముఖ లేక పరిచయం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వాహన యోగం కలుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకూల మార్పులు జరుగుతాయి. ఈవారం మొదట్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల నుంచి కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
వృషభ రాశి: కొన్ని ముఖ్యమైన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. శుభ పరిణామాలు జరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. భూ వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అనుకున్న కదలికలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వారం మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిడిలు తప్పవు.
మిథున రాశి: అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కళా రంగానికి చెందిన వారికి నిరాశ ఎదురవుతుంది. వారం చివరలో శుభవార్తలు వింటారు. ధన మరియు వస్తు లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ముఖ్యమైన పనులను చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చాలా కాలం నుంచి ఉన్న రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. మీలో ఉన్న ప్రతిభ అందరికీ తెలుస్తుంది. బాగా పలుకుబడి ఉన్నా వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు అలాగే ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. వారం చివరలో బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
సింహరాశి: ఏ పని చేసిన విజయవంతంగా పూర్తి అవుతుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. భూములు అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సమయం సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
కన్యరాశి: ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. చాలా కాలం నుంచి పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గృహం మరియు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఊహించిన అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. ఉద్యోగంలో ఉన్న చిక్కులు నుంచి బయటపడతారు. వారం చివరలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
తులారాశి: ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులను ప్రారంభించే అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు మంచి లాభాలను ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా ఉంటారు. ఇంటి నిర్మాణ పనులకు సమయం అనుకూలంగా ఉంది. ఆహ్వానం పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. ఉద్యోగంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వారం చివరిలో ధన వ్యయం కలుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి అనుకున్న సమాచారం అందుతుంది. ఇంట బయట విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త పెట్టుబడులతో వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగంలో సమయం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే వారం ప్రారంభంలో ధనవ్యయం కలుగుతుంది.
ధనస్సు రాశి: ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు బాగా పొందుతారు. ఉద్యోగంలో ఉన్న బాధ్యతలను పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశముంది. ఇంట్లో ఒత్తిడి ఉంటుంది.
మకర రాశి: ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు.చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. వారం మధ్యలో కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
కుంభరాశి: అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సన్నిహితులతో ఉన్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు మరియు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు బాగా పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. వారం చివరలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది.
మీనరాశి: ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేతికి రావలసిన డబ్బు వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో పురోగతి సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అనుకున్న స్థాయిలో వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. వారము మధ్యలో అనుకోని దూర ప్రయాణాలు కలుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సోదరుల నుంచి ఒత్తిడి ఉంటుంది.