Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు మనిషి జీవితానికి సంబంధించి అనేక నియమాలను తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఇతని గురించి మన దేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చానిక్యుడు ఒక గొప్ప పండితుడు, రాజకీయవేత్త మరియు అపరమేధావి కూడా. నీతి శాస్త్రంలో ఆచార్య చాణుక్యుడు ఒక వ్యక్తి ఆనందంగా మరియు విజయవంతంగా జీవితం గడపడానికి సంబంధించిన కొన్ని విధి విధానాలను తప్పకుండా పాటించాలి అంటూ తెలిపాడు. నీతి శాస్త్రం ద్వారా మనుషులకు ఉపయోగపడే అనేక విషయాల గురించి ఆచార్య చాణిక్యుడు ప్రస్తావించాడు.
ఆచార్య చాణిక్యుడి అనేది శాస్త్రంలోని నియమాలను పాటించిన వాళ్ళు చాలామంది జీవితంలో విజయం కూడా సాధించారు. ఒక వ్యక్తి జీవితంలో ఆనందంగా విజయవంతంగా ఉండాలంటే ఈ మూడు నియమాలను పాటించాలి అంటూ చాణిక్యుడు తెలిపాడు. ఆ మూడు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఇతరులకు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాము. కానీ అలా చేయకూడదు.
కోపం అనేది మనిషికి ఉండే ఓ భావోద్వేగం. మనం ఎక్కువగా కోపంలో ఉన్న సమయంలో స్పృహ కోల్పోతాం. ఎక్కువగా కోపంగా ఉన్న సమయంలో సమాధానాలు చెప్పకూడదు. దీని కారణంగా ఆ బంధం చెడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఒక వ్యక్తి బాధలో విచారంగా ఉన్న సమయంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. ఈ నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుగా మారుతాయి.