Aadhaar: ఒక మొబైల్ నెంబర్ కు ఒకే ఆధార్.. కాదని ఎక్కువ ఆధార్ కార్డులను లింకు చేస్తే ఏమవుతుందో తెలుసా…!

Aadhaar
Aadhaar

Aadhaar: ప్రతి ఒక్కరు కూడా తమ మొబైల్ నెంబర్ను ఆధార్ కార్డుకు లింక్ చేయడం తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. మొబైల్ నెంబరు ఆధార సంబంధిత సేవలను వినియోగించిన సమయంలో ఆధార్ కార్డును వేరొకరు దుర్వినియోగం చేయకుండా నిరోధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ గుర్తింపు కార్డులో 12 అంకెల సంఖ్యలు ఉంటాయి. అయితే ఈ 12 అంకెల సంఖ్యతో పాటు పేరు, వయస్సు, లింగం, చిరునామా, వేలిముద్రలు మరియు ఐరిస్ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఆధార్ కార్డులో ఉంటాయి.

ఒక వ్యక్తి భారతీయ పౌరుడు అనే నిర్ధారించడంలో ఈ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. అయితే చాలామంది ఆధార్ కార్డును వివిధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. అయితే చాలామంది ఒక ఆధార్ కార్డును ఒక నెంబర్కు మాత్రమే లింక్ చేయాలా అనే సందిగ్ధంలో ఉంటారు. అయితే యు ఐ డి ఏ ఐ నిబంధనల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులను ఒక మొబైల్ నెంబర్ కు లింక్ చేసే అనుమతి ఉంది. కానీ దీనికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఒక కుటుంబానికి చెందినవారు తమ ఆధార్ కార్డులను ఒకే మొబైల్ నెంబర్కు లింకు చేసుకునే అవకాశం ఉంది.

ఉదాహరణకు చెప్పాలంటే పిల్లల ఆధార్ కార్డులను వారి తల్లిదండ్రుల మొబైల్ నెంబర్కు లింకు చేసుకోవచ్చు. ఓకే కుటుంబానికి చెందినవారు ఏ కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డులను ఏ మొబైల్ నెంబర్ కైనా లింకు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ కుటుంబ సభ్యులు కాని వారు అలాగే వారి స్నేహితులు వారి ఆధార్ కార్డులను ఇతరుల మొబైల్ నెంబర్కు లింకు చేయడానికి అనుమతి లేదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now