Metpally: తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే సంజయ్

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి/ఇబ్రహీం పట్నం, మే13 (ప్రజా శంఖారావం): తడిచిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంట కోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని తెలిపారు.

ఆగమేఘాల మీద కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఇప్పటివరకు ధాన్యం కుప్పల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడా సమర్థవంతంగా జరగడం లేదని విమర్శించారు. సాయంత్రం వేళలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

రైతులు రెక్కల కష్టాన్ని ప్రభుత్వం ఇంత దారుణంగా చూడడం సరికాదని మండిపడ్డారు. మరో వైపు నియోజకవర్గంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వలు ఉన్నాయని, లారీల కోసం రైతులు ఎదురు చూసురున్నారని, మరో 15 రోజులు గడిస్తే వర్షాలు పడుతాయని, అప్పుడు ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా డిసిఓ మనోజ్ తో ఫోన్ లో మాట్లాడి నియోజకవర్గంలో వరి ధాన్య కొనుగోల్లు వేగవంతం చేయాలని, తడిచిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now