Post Office Scheme: సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మీరు ప్రతిరోజు 50 రూపాయలు పెట్టుబడి చేస్తే చాలు మెచ్యూరిటీ సమయానికి ఏకంగా 35 లక్షలు రాబడి పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బెస్ట్ పథకాలలో గ్రామ సురక్ష యోజన పథకం కూడా ఒకటి. 19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. అలాగే ఈ పథకంలో మీరు కనీసం గా పదివేల రూపాయల నుంచి గరిష్టంగా 10 లక్షల వరకు పెట్టుబడి చేసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా ఈ పథకంలో భారీగా రాబడి అందుకోవచ్చు. ప్రభుత్వ భరోసా పోస్ట్ ఆఫీస్ పథకాలలో లక్షలాదిమంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు.
గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద పోస్ట్ ఆఫీస్ లో ఇప్పటివరకు అనేక పథకాలు ప్రారంభమయ్యాయి. వీటిలో గ్రామ సురక్ష యోజన పథకం కింద మీరు ప్రతిరోజు 50 రూపాయలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మెచ్యూరిటీ సమయానికి 35 లక్షల భారీ రాబడి అందుకోవచ్చు. అయితే గ్రామ సురక్ష యోజన పథకంలో మీకు 80 ఏళ్ల వయసులో బోనస్ తో పాటు మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పెట్టుబడి పెట్టిన వ్యక్తి 80 ఏళ్లలోపు మరణించినట్లయితే అతను ఇచ్చిన నామినీకి ఆ మొత్తం మెచ్యూరిటీ డబ్బు అందుతుంది.
భారతీయ పౌరులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో పదివేల నుంచి పది లక్షల వరకు మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా మీరు రాబడి ఉంటుంది. మీరు ఈ పథకంలో నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వాయిదాలను చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు 19 ఏళ్ల వయసులో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న గ్రామ సురక్ష యోజన పథకం ప్రారంభించినట్లయితే మీకు 55 ఏళ్ల వయసు వచ్చే వరకు మీరు రూ.1,515 ప్రీమియం చెల్లించాలి.