September 15, 2024
Female Delivery in RTC Bus

Female delivery in RTC Bus: ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మ

Female delivery in RTC Bus: జోగులాంబ గద్వాల జిల్లా, ఆగస్టు 19 (ప్రజా శంఖారావం): పల్లె వెలుగు బస్సులో పండంటి ఆడబిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చింది. బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ తల్లికి మహిళా బస్సు కండక్టర్ బాసటగా నిలిచి పురుడు పోసింది. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణి సంధ్య వనపర్తికి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేస్తుంది. మార్గమధ్యంలో గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గమనించిన బస్సు మహిళా కండక్టర్ భారతి (153073) స్పందించి ఆ మహిళకు బాసటగా నిలిచి పురుడు పోసింది. వనపర్తికి చేరుకోవడానికి ఇంకో 15 కిలోమీటర్ల దూరం మిగిలి ఉండగా ఆ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. గమనించిన బస్సు మహిళా కండక్టర్ డిపో మేనేజర్ కు సమాచారం అందించింది. మేనేజర్ సూచనల ప్రకారం బస్సును రోడ్డు పక్కన నిలిపి బస్సు లోంచి ప్రయాణికులను కాసేపు కిందికి దింపేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఏఎన్ఎం సాయంతో గర్భిణీ సంధ్యకు బస్సులోనే డెలివరీ చేశారు. ప్రసవంలో పండంటి ఆడబిడ్డకు గర్భిణి జన్మనిచ్చింది. తల్లి కూతుర్లు క్షేమంగా ఉండడంతో 108 కి ఫోన్ చేసి అంబులెన్సులో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. మానవత్వంతో స్పందించిన మహిళా కండక్టర్ భారతిని ప్రయాణికులందరూ అభినందించారు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *