New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా…మీకో భారీ గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం

New Ration Card
New Ration Card

New Ration Card: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డు కోసం చాలామంది అప్లై చేసుకుంటున్నారు. ఇటువంటి వారి కోసం తాజాగా ప్రభుత్వం ఒక మంచి వార్త తెలిపింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాలలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మే నెల 15వ తేదీ వరకు 21 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది జనాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. 11 వేలకు పైగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అనంతపురం జిల్లాలో వచ్చాయి. అలాగే పదివేల వరకు కొతరేషన్ కార్డుల దరఖాస్తులు శ్రీ సత్య సాయి జిల్లాలో వచ్చినట్లు సమాచారం.

ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదయ్యే లాగా పూర్తి చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను జూన్ నెలలో మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన ఇతర సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లందరికీ కూడా జూన్ నెలలో స్మార్ట్ రేషన్ కార్డులో లభిస్తాయి అని తెలుస్తుంది.

జనాలు కేవలం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మాత్రమే కాకుండా రేషన్ కార్డులో చిరునామా మార్పు, కొత్త సభ్యులను చేర్చడం, సభ్యులను తొలగింపు, విభజన వంటి సర్వీసులకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతపురం ఇన్చార్జి డిఎస్ఓ జగన్మోహన్ రావు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందంటూ తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now