Gold Chain snatching: నిజామాబాద్ టౌన్, అక్టో బర్ 13 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ పట్టణ కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన ఆదివారం నగరంలోని వినాయక నగర్ లో చోటుచేసుకుంది.
మహిళా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వినాయక నగర్ గ్రీన్ బకెట్ బిర్యాని పాయింట్ ముందు బైక్ పై వచ్చిన దుండగులు బంగారం గొలుసులను అపహరించినట్లు బాధితురాలు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ఘటన జరిగిన ప్రాంతంలోని సిసి టీవీ పుటే జీలను పరిశీలిస్తున్నారు. బైక్ పై ముగ్గురు ఉన్నట్లు బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు పాత నేరస్తులు ఎవరైనా ఈ చోరికి పల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.