Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి దిశకు అలాగే వారంలో ప్రతి రోజుకు కూడా ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వారంలో ఉన్న ప్రతి రోజుకి కూడా ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో కొన్ని రోజులను పూజకు అలాగే విశ్రాంతికి మాత్రమే అని పరిగణించడం జరుగుతుంది. అలాగే వారంలో కొన్ని ప్రత్యేక రోజులలో ఇంట్లో బట్టలు ఉతికినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగే ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని చాలామంది నమ్మకం. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో మంగళవారం, శనివారం బట్టలు ఉతకడం చాలా అశుభంగా పరిగణిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు కుజుడికి సంబంధించిన రోజుగా చెబుతారు. అలాగే శనివారం శనీశ్వరుడికి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. కాబట్టి వారంలో ఈ రెండు ప్రత్యేక రోజులలో మాసిన బట్టలను ఉతికినట్లయితే ఈ దేవతలకు ఆగ్రహం కలిగి ఆశీర్వాదం ఇవ్వరని నిపుణులు చెప్తున్నారు. మంగళవారం రోజున మాసిన బట్టలు ఉతకడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. అలాగే రాత్రి సమయంలో కూడా బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు.
సాయంత్రం అయిన సమయంలో బట్టలను ఉతకడం లేదా ఆరబెట్టడం వంటి పనులు చేయడం వలన ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అని పెద్దలు చెప్తారు. మంగళవారం రోజున మాసిన బట్టలు ఉతకడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ క్రమంలో ఇంటి ఆర్థిక పరిస్థితి పై ప్రతికూల ప్రభావం కూడా పడుతుంది. ఇప్పటికీ కూడా చాలామంది తమ ఇళ్లలో మంగళవారం రోజున మాసిన బట్టలను ఉతకడం లేదా ఇంటిని శుభ్రపరచడం వంటి పనులను చేయరు. చాలామంది శనివారం రోజున శనీశ్వరుడిని పూజిస్తారు. ఈ ప్రత్యేక రోజున చాలామంది ఉపవాసం ఉండి దానాలు కూడా చేస్తారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన శనివారం రోజున మాసిన బట్టలు ఉతకడం వంటి పనులు చేయడం వలన అది అశుభకరమైనదిగా పరిగణిస్తారు.