Aadhaar Card: కేంద్రం గుడ్ న్యూస్.. ఆధార్ తరహాలో ప్రతి ఒక్కరికి కొత్త కార్డు.. ఈ కార్డు ఉపయోగాలు ఏంటో తెలుసా..!

Aadhaar Card
Aadhaar Card

Aadhaar Card: మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. భారతీయుడిగా దేశంలో పరిగణించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. మన దేశంలో కోట్లాదిమందికి ఆధార్ కార్డు నిత్య గుర్తింపు కార్డుగా మారిపోయింది. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, బలహీనవర్గాల ప్రజలు, చిన్నారులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు వెన్నుముకగా నిలిచింది. ముఖ్యంగా ఆధార్ కార్డును సంక్షేమ పథకాలలో ప్రమాణికంగా పరిగణిస్తారు. మనదేశంలో ఆధార్ కార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు సమయంలో తీసుకొని వచ్చిన డిజిటల్ యూపీఐ సేవలకు కూడా ప్రజలలో బాగా ఆదరణ పెరిగింది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

ప్రస్తుతం డిజిటల్ ఎకానమీలో యూపీఐ ముఖ్యపాత్ర పోషిస్తుంది అని చెప్పొచ్చు. గతంలో కంటే కూడా ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు ఘననీయంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా యూపీఐ, ఆధార్ కార్డు తరహాలో దేశ ప్రజల కోసం మరొక సదుపాయాన్ని తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో డిజిటల్ అడ్రస్ పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ప్రభుత్వం సర్వీస్ డెలివరీ మరియు డేటా సెక్యూరిటీ కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది.

దేశ ప్రజల చిరునామాను భద్రపరిచి అటు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు ఒకటే ప్రూఫ్ గా కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ అడ్రస్ విధానాన్ని తీసుకొని రాబోతుంది. కేంద్ర పోస్టల్ మరియు పిఎమ్ఓ శాఖ కొత్త డిజిటల్ అడ్రస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కేంద్ర ప్రభుత్వం భారత్ ను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాటర్ లోకి డిజిటల్ అడ్రస్ విధానం ద్వారా తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దేశంలో ఇప్పుడు అన్ని రంగాలలో కూడా డిజిటలైజేషన్ పెరిగిన కారణంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అడ్రస్ విధానం అందుబాటులోకి తేనుంది. దీనివలన రెండు ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తుంది. మన అడ్రస్ ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తులకు భద్రతగా పంపించవచ్చు. అలాగే అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు చేరే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లు అడ్రస్ భద్రపరుస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now