Vastu Tips: హిందూ మత శాస్త్రంలో సనాతన ధర్మం ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్కరూ గణపతికి మొదటి పూజ చేస్తారు. గణపతి విఘ్నాలను తొలగించే విజయాలను అందించేవాడు అని అందరి నమ్మకం. వాస్తు శాస్త్రంలో సనాతన ధర్మం ప్రకారం గణపతికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా గణపతి అనుగ్రహం వలన తొలగిపోతాయి. గణపతి విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం వలన ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుంది అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రంలో గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.
గణపతి తనను భక్తితో పూజించే భక్తులకు వచ్చే విఘ్నాలను తొలగిస్తాడు అని అందరి నమ్మకం. గణపతి భార్యలు సిద్ధి, బుద్ధిలో అలాగే శుభం, లాభం అయిన పిల్లలు. కాబట్టి గణపతి కుటుంబం మొత్తం ఆనందంగా ఉండేలాగా శ్రేయస్సు నీ కలిగిస్తాడని అందరి నమ్మకం. ఆయన ఉన్నచోట మంగలుడు ఉంటాడు. అందుకే ఈయనను మంగళ మూర్తి అని కూడా పిలుస్తారు. గణపతి విగ్రహం ఉన్న ఇంట్లో ఎటువంటి దోషం ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూర్చున్న గణపతి విగ్రహాన్ని పెట్టాలి.
6 అంగుళాల ఎత్తు లేదా 11 అంగుళాల వెడల్పు కంటే గణపతి విగ్రహం పెద్దగా ఉండకూడదు. ఈ విగ్రహాన్ని వెనుక భాగం కనిపించకుండా పెట్టాలి. ఇంట్లో ఈశాన్య, ఉత్తరం లేదా పడమర దిశలో గణపతి విగ్రహాన్ని పెట్టడం చాలా శుభప్రదం అని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో ఈ విధంగా చేయడం వలన ఆనందం, అదృష్టం కలుగుతుంది. ఈ విగ్రహం ముఖం ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా వినాయకుడి విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. విరిగిన విగ్రహాన్ని లేదా చిరిగిన వినాయక చిత్రపటాన్ని ఇంట్లో పెట్టకూడదు. గణపతి విగ్రహం లేదా గణపతి యంత్రాన్ని ఇంట్లో పెట్టడం వలన ఆ ఇంట్లో సంపద, ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి.