Govt Scheme: కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్పీ వర్గాలకు చెందిన మహిళలకు అనేక పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళల కోసం ఈ పథకంలో పెట్టుబడి పైన భారీగా సబ్సిడీ ని అందిస్తుంది. ఈ పథకం పేరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ పథకం. మహిళలకు కేంద్ర ప్రభుత్వం భూమి రూపంలో, యంత్రాల రూపంలో లేదా ఇతర ఖర్చుల రూపంలో పెట్టుబడి పెట్టడానికి సబ్సిడీని అందిస్తుంది. దీనినే క్యాపిటల్ సబ్సిడీ అని కూడా అంటారు.
మహిళలు ఇందులో పెట్టుబడి పైన 25 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. అంటే వాళ్లకు గరిష్టంగా 25 లక్షల రూపాయలు సబ్సిడీ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక కోటి రూపాయలతో మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినట్లయితే అందులో మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రూపంలో లభిస్తుంది. మీరు భూమి కొనుగోలు చేయడానికి, భవన నిర్మాణం చేపట్టడానికి, మిషన్లు కొనుగోలు చేయడానికి ఈ నగదును ఉపయోగించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం ఉంటుంది. ఈ పథకంలో మీకు మొదట పెట్టుబడి పెట్టిన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా సబ్సిడీ లభిస్తుంది. ఎస్సీ లేదా ఎస్టీ కులానికి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. వీళ్ళు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి మొదట బ్యాంకు నుంచి రుణం తీసుకొని పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యాపారం ఎంఎస్ఎంఈ పరిధిలోకి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మీరు ఈ పథకానికి అర్హత పొందుతారు. ముందుగా మీరు ప్రాజెక్టు రిపోర్ట్ ఉన్న తయారుచేసి దానిని బ్యాంకు లేదా రుణం పొందాలి అనుకుంటున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సమర్పించాలి.