PM Internship Scheme: మీరు ప్రతి నెల 5000 రూపాయలు పొందే లాగా ప్రభుత్వం అదిరిపోయే స్కీంను అమలులోకి తెచ్చింది. ఒకేసారి మరో 6000 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నాయి. నిరుద్యోగులకు సంబంధించిన పథకాలు కూడా చాలానే ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఆ పథకం పేరు పీఎం ఇంటర్షిప్ స్కీమ్.
దీనివలన చాలామంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. ఏడాది పాటు నిరుద్యోగులకు ఈ పథకం కింద శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వాళ్లకు ఉపాధి కూడా కల్పిస్తారు. శిక్షణ సమయంలో వాళ్లకు నెలకు 5000 లభిస్తాయి. ఇలాగే ఏడాది పాటు ప్రతినెల 5000 అందిస్తారు. అంటే ఏడాది మొత్తంలో 60000 వస్తాయి. దాంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. శిక్షణ పొందే వాళ్ళకి 6000 అందిస్తారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ భీమా మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.
ఏడాది పాటు శిక్షణలో ఆరు నెలలు శిక్షణ ఉంటుందని సమాచారం. ఆ తర్వాత మిగిలిన ఆరు నెలలు ఇంటర్నెషిప్ చేయాలి. తర్వాత వాళ్లకు ఉపాధి కూడా కల్పిస్తారు. పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ఇలా ఏది చదివిన ఈ పథకానికి అర్హులని మెదక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 11వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. వయసు పరిమితి 21 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు.https:/pminternship.mca.gov.in/login/ ద్వారా ఈ పథకానికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలను అందించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.