WhatsApp Blocked: మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ అయ్యిందా.. వెంటనే ఇలా చేయండి

WhatsApp Blocked
WhatsApp Blocked

WhatsApp Blocked: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చాట్ చేయడానికి అలాగే వీడియో కాల్స్ మాట్లాడడానికి వాట్సాప్ ను వాడుతున్నారు. అయితే దీనిని వాడడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాట్సాప్ సంస్థ నియమాలు ఉల్లంఘించిన వాళ్ళ అకౌంట్లో పై చర్యలను చేపడుతుంది. వాళ్ళ అకౌంట్లను వాట్సాప్ సంస్థ బ్లాక్ చేయడం లేదా నిషేధించడం వంటి చర్యలు చేస్తుంది. ప్రతిసారి వాట్సాప్ తన కస్టమర్ల కోసం ఏదో ఒక కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో వాట్సాప్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం వాట్సాప్ ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి ఖాతా బ్లాక్ చేయబడుతుంది. వాట్సాప్ మెటా పాలసీకి విరుద్ధంగా ఉన్న ఖాతాలను బ్లాక్ చేస్తుంది లేదా నిషేధిస్తుంది. కానీ కొంతమంది ఖాతాలు మాత్రం ఏ తప్పు చేయకుండానే బ్లాక్ అవుతూ ఉంటాయి.

ఒకవేళ మీరు ఏ తప్పు చేయకుండా మీ వాట్సాప్ ఖాతా బ్లాక్ అయినట్లయితే ఈ ప్రక్రియను అనుసరించి మీరు మీ ఖాతాను వెనక్కి తెచ్చుకోవచ్చు. వాట్సాప్ ఉపయోగించేవాళ్లు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను తప్పితే వాళ్ల ఖాతాను వాట్సాప్ సంస్థ నిషేధిస్తుంది. ఎవరికైనా స్పామ్ సందేశాలను పంపడం, అసభ్యకరమైన కంటెంట్ లేద అశ్లీలమైన ఫోటోలను పంపడం, ఎక్కువ గ్రూపులను ఆహ్వానించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటివి చేయకూడదు. వాట్సాప్ సంస్థ మీ ఖాతాను నిషేధించిన సమయంలో మీకు నోటిఫికేషన్ కూడా పంపుతుంది. ఆ నోటిఫికేషన్ లో ఆ ఖాతాను నిషేధించడానికి గల కారణాన్ని తెలుపుతుంది.

ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవడం వలన మీ ఖాతా ఎందుకు నిషేధించబడిందో మీకు తెలుస్తుంది. వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘన చేయడం వలన ఎక్కువగా వాట్సాప్ ఖాతా నిషేధించబడుతుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ వాడడం ద్వారా కూడా ఇలా జరుగుతుంది. ఒకవేళ మీ ఖాతా మెసేజ్ ఇస్తే వాట్సాప్ సపోర్ట్ టీం ను సంప్రదించండి. వాట్సాప్ లో ఉన్న సహాయ విభాగానికి వెళ్లి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మీ కాంటాక్ట్ నెంబర్ తో పాటు పూర్తి వివరాలు అలాగే మీ ఖాతా నిషేధించడానికి గల కారణాన్ని ఈమెయిల్ ద్వారా పంపండి. ఈ నిషేధాన్ని వాట్సాప్ సంస్థ 24 గంటల నుంచి 30 రోజులలోపు తొలగిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now