Cars: కారు కొనాలనుకుంటున్నారా…మీకో షాకింగ్ న్యూస్.. కొత్త రూల్ అమలు చేస్తున్న సర్కార్

Cars
Cars

Cars: మనదేశంలో వాహనాలకు కిలోమీటర్కు అత్యధిక సాంద్రత కలిగి ఉన్న ప్రధాన నగరాలలో ముంబై నగరం కూడా ఒకటి అని చెప్పొచ్చు. కానీ ముంబై నగరంలో పెరుగుదలకు అనుగుణంగా తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోడ్లమీద ఎక్కడికక్కడ వాహనాల రద్దీ బాగా పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో కొత్త వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లకు పార్కింగ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అంటూ ముంబై నగరంలో చెన్నై పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తాజాగా మహా సర్కార్ కొత్త కారు కొనాలని అనుకుంటున్నా వాళ్లకు షాకింగ్ న్యూస్ తెలిపింది.

ప్రభుత్వం తాజాగా నో పార్కింగ్, నో కార్ అనే కొత్త నియమాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో కొత్త కారు కొనాలని భావిస్తున్న వారు ముందుగా వాళ్ళు సంబంధిత అధికారుల నుంచి కార్ పార్కింగ్ స్పేస్ ప్రూఫ్ సర్టిఫికెట్ను సమర్పించి ఆ తర్వాత కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముంబై నగరంలో కార్ పార్కింగ్ కు స్థలం లేకపోవడం వలన రోడ్లపై అలాగే ఫుట్పాత్లపై, మిగిలిన ఖాళీ స్థలాలలో కూడా కార్లతో నిండిపోతున్నాయని, అందుకే ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ మరియు కార్ల పార్కింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కిలోమీటర్లు అత్యధిక వాహన సాంద్రత ఉన్న నగరాలలో ముంబై నగరం టాప్ లో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నగరంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి డాక్యుమెంట్ తప్పనిసరిగా చేస్తూ కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. కాబట్టి ముంబై నగరంలో కొత్తగా కారు కొనాలని భావిస్తున్న వారు ముందుగా పార్కింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్ ని ప్రవేశపెట్టి ఆ తర్వాత తమ కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now