Aadhaar Card: ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ మన్నించే పథకాల దగ్గర నుంచి బ్యాంకులో రుణం పొందడం వరకు అన్నిటికీ కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు లేకపోతే మీరు కనీసం సిమ్ కార్డు కూడా పొందలేరు. అయితే అటువంటి ఆధార్ కార్డును మీరు దుర్వినియోగం చేస్తే మీకు జైలు శిక్ష తప్పదు. ప్రత్యేకించి ఆధార్ కార్డు ఐడి కోసం ఆధార్ కార్డు డేటా, వేలిముద్రలు మరియు ఐరిస్ వంటివి స్కాన్ చేసి చార్జర్ చేస్తారు.
ఇటువంటి డేటాను ఎవరైనా మోసపూరితంగా ఉపయోగించినట్లయితే వారికి భారీ జరిమానా తప్పదు. 2021 యుఐడిఏఐ నియమాల ప్రకారం అనధికార యాక్సెస్ లేదా యుఐడిఏఐ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే వారికి భారీ జరిమానా విధిస్తారు. ఒక వ్యక్తి యొక్క ఆధార వివరాలను ఫోర్జరీ చేసి మార్చడం వంటివి చేసి నకిలీ ఆధార్ తయారు చేయడం చట్టరీత్యా నేరం. అలా చేసినవారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా పడుతుంది.
ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు ఎవరైనా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి. మై ఆధార్ వెబ్సైట్ కి వెళ్లి ముందుగా లాగిన్ అవ్వండి. ఆ తర్వాత అక్కడ మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి క్యాప్చ కోడ్ ఎంటర్ చేయండి. మీకు ఓటిపి తో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటిపి నెంబర్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అక్కడ మీకు అతంటికేషన్ హిస్టరీ ఉంటుంది. అక్కడ మీరు మీ ఆధార్ కార్డు ఎక్కడ ఎప్పుడు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. అక్కడ మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు మీరు గమనించినట్లయితే వెంటనే ఈ విషయాన్ని యుఐడిఐ కి తెలియజేయండి.