New Ration Cards: మీకు రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వం ఈ పండగకి బంపర్ ఆఫర్

New Ration Cards
New Ration Cards

New Ration Cards: త్వరలో ఉగాది పండుగ రాబోతుంది. అలాగే ఈ నెలలో రంజాన్ పండుగ కూడా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం యువతి యువకులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. మీరు చదువు అయిపోయాక ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారా. ఇప్పటివరకు మీకు జాబ్ రాలేదా. అయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ గుడ్ న్యూస్ మీకోసమే. ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతుంది.

ఇందులో భాగంగానే ప్రభుత్వం గుంటూరు కొత్తపేటలో ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సెల్ ఫోన్ రిపేర్ లో నిరుద్యోగ యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందవచ్చు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 7 నుంచి మొదలు కానుంది. సంస్థ డైరెక్టర్ బివి రావు మాట్లాడుతూ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు ఈ మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక ఈ ఉచిత శిక్షణ అర్హతల గురించి చెప్పాలంటే. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అర్హత కలిగిన వాళ్ళకి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అలాగే ఉచిత శిక్షణ పొందుతున్న వాళ్లకి వసతి సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. అయితే వీళ్లకు తెల్ల రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాలి. యువతి యువకులు పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జిరాక్స్ కాపీలతో పాటు నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now