Acharya Chanakya Niti: ఆచార్య చాణిక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఈయన గొప్ప పండితుడు మాత్రమే కాదు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త మరియు తత్వవేత్త. ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి అందులో మానవాళికి సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించాడు. మనిషి జీవితానికి సంబంధించిన అనేక సూచనలను కూడా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. ఈ తరం వాళ్లకి కూడా చానిక్యుడు చెప్పిన సూచనలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈయన నియమాలను అనుసరించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి మనిషి కూడా తమ జీవితంలో చేయకూడని చెడ్డ పనులు అలాగే చేయాల్సిన మంచి పనుల గురించి ఆచార్య చానిక్యుడు వివరించారు.
మనం తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా కూడా భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా యవ్వనంలో ఉన్న సమయంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. యవ్వనంలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. నువ్వు ఎవరికైనా మంచి చేసిన లేదా చెడు చేసిన, నలుగురికి సహాయం చేసిన కూడా అది యవ్వన వయసులో ఉన్న సమయంలోనే కానీ నువ్వు ఆ సమయాన్ని వినోదాల కోసం కేటాయించినట్లయితే తర్వాత నీ జీవితం మొత్తం చీకటిలో గడపాల్సి వస్తుంది అంటే ఆచార్య చానిక్యుడు తెలిపాడు. అందుకే యవ్వనంలో విలువైన సమయాన్ని వృధా చేయకూడదు అంటూ ఆచార్య చాణిక్యుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే డబ్బులు ఖర్చు చేయడం కూడా చాలా మూర్ఖత్వం అంటూ ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు.
యవ్వన వయస్సులో ఉన్న సమయంలో ఆలోచించకుండా డబ్బులను వృధాగా ఖర్చు చేసినట్లయితే నువ్వు వృద్ధాప్యంలో ఉన్న సమయంలో కష్టాల జీవితం గడపాల్సి వస్తుంది. పేదరికంలో మునగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నువ్వు చచ్చే వరకు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంటూ ఆచార్య చానిక్యుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి యవ్వనంలో ఉన్న సమయంలో డబ్బును వృధా చేయకుండా పొదుపు చేయాలని ఆచార్య చాణిక్యుడు సలహా ఇస్తున్నాడు. యవ్వనంలో ఉన్న సమయంలో తప్పుడు వ్యక్తులతో స్నేహం కూడా చేయకూడదు. అలాగే యవ్వనంలో ఉన్న సమయంలో ముఖ్యంగా తమ కెరియర్ పై దృష్టి పెట్టాలి అని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నాడు.