Ration New Timings: పౌరసరఫరాల శాఖ తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను తీసుకోవాలి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వచ్చేనెల జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల విధానంలో కొన్ని కొత్త మార్పులు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా పౌరసరఫరాల శాఖ కొత్త విధానాలను అమలు చేసింది.
జూన్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయబోతున్నారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనం ఏ సమయంలో వస్తుందో ఏ సమయంలో వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో రేషన్ కార్డు ఉన్నవారు వాహనం కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవారికి ఇటువంటి కష్టాలు ఉండవు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అలాగే సాయంత్రం సమయంలో నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలలో రేషన్ కార్డుదారులు సరుకులు తీసుకోవచ్చని తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఆదివారంలో కూడా రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులకు అలాగే వికలాంగులకు రేషన్ సరుకులను ప్రతినెలా ఒకటవ తేదీ నుంచి 5వ తేదీల్లోగా డీలర్ ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఒకవేళ ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా మీకు సమీపంలో ఉన్న రేషన్ షాపు ద్వారా మీరు రేషన్ సరుకులను పొందవచ్చు అని మంత్రి తెలియజేశారు.