Vastu Tips: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో వ్యక్తుల చెడువాల వాటిల కారణంగా నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలగవచ్చు. అన్ని నియమాలను వదిలి ఆధునికత పేరుతో జీవితం సాగిస్తుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఒకవేళ అవి ఎంత ప్రయత్నించినా కూడా తగ్గకపోయినా మీ జీవితంలో దురదృష్టానికి కారణమయ్యే కొన్ని ప్రధాన అలవాట్లను విడిచి పెట్టాలి. ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వలన ఉదయం లేటుగా లేస్తారు. ఇటువంటి చెడు అలవాటు మీకు కూడా ఉన్నట్లయితే వెంటనే దానిని మార్చుకోండి. ఎందుకంటే ఈ అలవాటు ఉన్నవారు చంద్రగ్రహానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారని నిపుణులు చెప్తున్నారు. వీళ్లు తరచుగా మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. ఈ సమస్యలను నివారించడానికి రాత్రి సరైన సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఉదయం సరైన సమయానికి నిద్రలేవాలి.
జ్యోతిషా శాస్త్రంలో మొక్కలకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంట్లో మీరు పెట్టుకున్న మొక్కలు ఎండిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మొక్కలకు ఎరువులు మరియు నీరు ఇవ్వాలి. ఇంట్లో మొక్కలు ఎండిపోతే బుధ గ్రహానికి సంబంధించిన దోషాన్ని మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఎండిన మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రవేశపెడతాయి. ఎండిపోయిన మొక్కలను ఇంటి నుంచి తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను పెట్టుకోవాలి. ఇంట్లో ఉండే బాత్రూం ఎల్లప్పుడూ మురికిగా లేకుండా చూసుకోవాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే రాహు కేతువుల ప్రభావాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో మురికి బాత్రూం ఉన్నట్లయితే ఆకస్మిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు. అలాగే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత సింక్లో ఖాళీ పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి.
కాబట్టి రాత్రి సమయంలో పాత్రలను కడిగి నిద్రపోవాలి. రాత్రిపూట సింకులో పాత్రలను కడగకుండా అలాగే ఉంచిన వారికి లక్ష్మీదేవి ఆగ్రహం కలుగుతుంది. భోజనం చేసిన తర్వాత ప్లేటును అక్కడే వదిలేసిన వారికి చంద్రుడు మరియు శని సంబంధిత సమస్యలు కలుగుతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత ప్లేటును తీసేసి అందులో చేతులు పడుకోకపోతే జీవితంలో మీకు రకరకాల మానసిక మరియు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంటా బయట ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. అటువంటి వారికి బుధ గ్రహం ప్రభావం కలుగుతుంది. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ చెప్పులు బూట్లు వదలకూడదు. చెప్పులు చల్లాచెదురుగా ఉండకూడదు. ఈ అలవాటు కారణంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంట్లో చెప్పులను సరిగ్గా పెట్టాలి.