Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.. జూన్ 14 వరకు మాత్రమే ఛాన్స్

Aadhaar Card
Aadhaar Card

Aadhaar Card: ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు మార్చుకోవాలి అని అనుకుంటున్నా వాళ్ళకి కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు అవుతున్నా కూడా మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. మీరు ప్రస్తుతం ఒక రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవచ్చు. దీనికోసం మీకు జూన్ 14, 2025 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి రుసుమ చెల్లించాల్సి ఉంటుంది. ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు ఆన్లైన్ లో ఉచితంగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీకు జూన్ 14, 2025 వరకు గడువున పొడిగించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ గడువును చాలా సార్లు పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి ఈ గడువును పొడిగించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది అడుగు తేదీలోపు మీరు మీ ఇంటి నుంచే ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి 50 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ ఎన్రోల్మెంట్ మరియు అప్డేట్ రెగ్యులేషన్స్ 2026 ప్రకారం ఆధార్ కార్డు ఉన్నవారు కచ్చితంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి గుర్తింపు వివరాలతో పాటు అడ్రస్ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలి.

తరచుగా ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్డేట్ చేసుకోవడం ద్వారా మీ ఆధార్ కార్డులో ఉన్న పూర్తి సమాచారం సరైనదిగా అలాగే ఇతర డాక్యుమెంట్లలో ఉన్నట్లుగా ఉంటుంది. తరచుగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోతే మీరు ప్రభుత్వ సబ్సిడీలు పొందడంలో అలాగే బ్యాంకు ఖాతా తెరవడంలో, కేవైసీ అప్డేట్ చేసే విషయంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్డేట్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డును ఇతరులు ఉపయోగించకుండా అలాగే ఎటువంటి స్కాములు కూడా జరగకుండా నివారించేందుకు ప్రభుత్వ అధికారులకు ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now