IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి పోరుకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు పోరాడడానికి రెడీగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కు టికెట్ల ధరలో ఆకాశాన్ని తాగుతున్నాయి. పిసిబి ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో టికెట్ల రేట్లు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. ఎక్కడ ఆడినా కూడా భారత క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆడుతున్న భారత్ జట్టు ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఫైనల్ కు చేరుకుంది.
ఆదివారం నాడు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ తో తలబడనుంది. రోహిత్ శర్మ సేన మరో ఐసీసీ టైటిల్ను సాధించేందుకు పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. దుబాయ్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు ప్రస్తుతం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మ్యాచ్ టికెట్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే 25 వేల టికెట్లు అమ్ముడు అయ్యాయి. టికెట్ ధరలు సుమారుగా 6000 నుంచి గరిష్టంగా 2,83,000 వరకు ఉన్నాయని సమాచారం. అయితే టీమిండియా ఫైనల్ కి చేరుకోవడంలో టికెట్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడిన క్రమంలో ధరలను కూడా అదే స్థాయిలో నిర్ణయించినట్లు ప్రకటించడం జరిగింది. జియో టీవీ నివేదికల ప్రకారం అమ్మకాల ధారాల మొత్తం 212903910 గా అంచనా వేసినట్లు సమాచారం. జనరల్ టికెట్లు 6000 నుంచి 11828 గా ఉన్నాయి.