Acharya Chanakya Neeti: జీవితంలో విజయం సాధించాలంటే.. ఈ 3 సూత్రాలు పాటిస్తే చాలు.. చాణిక్యుడు..
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేది సర్వసాధారణం. అయితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా కొన్ని చిట్కాలు పాటించి వాటిని ఎదుర్కోవాలని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తి చేయడానికి మీరు ఈ మూడు సింపుల్ చిట్కాలను పాటించిన సరిపోతుంది. ఆచార్య చాణిక్యుడు పురాతన భారతీయ తత్వవేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఆయన తాను రచించిన నీతి శాస్త్రంలో మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి ప్రస్తావించాడు. మీరు ఒక పని అనుకోని దానిని పూర్తి చేయని సమయంలో మిమ్మల్ని మీరు అసమర్ధులుగా భావిస్తారు.
కొంతమంది జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదురుకోలేక మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు. ఇటువంటి వారి కోసం ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో కష్టాలను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలను కూడా తెలిపాడు. ఏదైనా ముఖ్యమైన పనిని చేస్తున్న సమయంలో మీరు ఆచార్య చాణుక్యుడి ప్రేరణ కలిగించే అద్భుతమైన సూత్రాలను పాటించినట్లయితే మీరు అనుకున్న పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ విజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించాలి. వ్యక్తుల దగ్గర ఉండే తిరుగులేని ఆయుధం విజ్ఞానం మాత్రమే. ఎటువంటి భయంకర సందర్భాలు, కష్టాలు ఎదురైనప్పుడు కూడా జ్ఞానం అనే శక్తివంతమైన ఆయుధంతో మీరు చాలా సునాయాసంగా ఆ సమస్యలను పరిష్కరించ గలుగుతారు.
విజ్ఞానవంతులకు ఒప్పుతప్పుల గురించి అవగాహన ఉంటుంది. వాళ్లు కష్టాలు వచ్చిన సమయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. అలాగే మీరు విజయం సాధించడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. విజ్ఞానం మీకు విజయానికి మార్గం సులభంగా చేస్తుంది. విజయం సాధించిన వాళ్లకు ఈ సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. కాబట్టి మనిషి ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేస్తూనే ఉండాలి. ఇక ఆచార్య చాణిక్యుడు చెప్పిన మరొక విషయం ధర్మాన్ని పాటించడం. డబ్బు కంటే కూడా ధర్మం విలువైనది. మన జీవితం మార్గ నిర్దేశం చేయడంలో ధర్మం మనలను కాపాడుతుంది. ధర్మం పాటించడం వలన సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.