Chanakya Neeti: లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే.. ఈ చెడు అలవాట్లను వదులుకోవాలి..
ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో మనిషి కష్టపడి పనిచేయడం అలాగే నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అని తెలిపాడు. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ కుటుంబ సభ్యుల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి. అయితే కొన్ని చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు అని ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది. తమకు వచ్చిన పదవిని దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు.
ఈ అలవాటు ఉన్నవారు ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. కాబట్టి ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. ఇటువంటి అలవాటు ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. అలాగే మనది కానీ డబ్బు కోసం ఆశపడకూడదు. జీవితంలో మనం కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే చాలా కాలం ఉంటుంది. దురాశపరులను కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. అలాగే తప్పుడు సహవాసం కూడా మంచిది కాదు అని ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు.
ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే అతను తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని వెంటనే వదిలేయాలి. అప్పుడే అతనికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అవసరం లేకుండా డబ్బులను ఖర్చు చేయడం కూడా మంచి అలవాటు కాదు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవిని అగౌరవ పరిచినట్లు అవుతుంది. కాబట్టి డబ్బును ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండాలి. డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తే అటువంటి వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్లిపోతుంది అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు.