Inter Board: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల ఇంగ్లీష్ క్వస్షన్ పేపర్ లో స్పష్టంగా లేని క్వశ్చన్ కు ఆన్సర్ రాసేందుకు ట్రై చేసిన వారికి ఆ ఇంగ్లీష్ పేపర్లో 4 మార్కులు కలపాలని ఇంటర్ బోర్డు నిర్ణయం..
Telangana government Inter Board Decided to Give Four Marks to Worngly Printed Question: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండవ సంవత్సరం విద్యార్థుల ఇంగ్లీష్ పేపర్ లో ఒక ప్రశ్న అస్పష్టంగా ప్రింట్ అయింది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సరిదిద్దుకునే చర్యలు చేపట్టింది. ఇంగ్లీష్ పేపర్ లో అస్పష్టంగా ప్రింట్ అయిన ఏడో ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ ప్రశ్నకు జవాబు రాసేందుకు ప్రయత్నం చేసిన విద్యార్థులకు 4 మార్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
సరిగ్గా ప్రింట్ కాలేని ఆ క్వశ్చన్ ను అటెండ్ చేసిన విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం : సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఇంగ్లీష్ పరీక్షలో 7 క్యూస్షన్ గా ఇచ్చిన చార్ట్‌లో ప్రింట్ లోపం కారణంగా బాక్సులు అస్పష్టంగా కనబడ్డాయి. ఆ క్యూస్షన్ ప్రింట్ సరిగా లేనందున జవాబు సరిగా రాయలేక పోయినట్లు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు బోర్డు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సబ్జెక్టు నిపుణులు, ఇతరులతో చర్చించిన బోర్డు అనంతరం విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.