8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత తమ జీవితాలు అలాగే తమ పెన్షన్లు పెరుగుతాయి అని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వారికి ఏడవ వేతన సంఘం అమలులోకి వచ్చిన సమయంలో వారి బేసిక్ పెన్షన్ పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రిటైర్డ్ అయిన వారి బేసిక్ పెన్షన్ తొమ్మిది వేలకు పెంచారు. ఈ క్రమంలో మాక్సిమం పెన్షన్ రూ.1,25,000 కు చేరుకుంది.
అయితే 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పై ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగి బేసిక్ పెన్షన్ అలాగే ఉంటుంది కానీ అతని డియర్ నెస్ రిలీఫ్ లో ఎల్లప్పుడూ ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు ద్రవయోల్బన డేటా ఆధారంగా డిఆర్ ని ఇంక్రిమెంట్ చేస్తారు. ఎనిమిదవ వేతన సంఘంలో కూడా పెన్షన్స్ సవరణ అనేది ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పై ఆధారపడి ఉంటుంది. ఇది మల్టీప్లైయర్ గా కూడా పనిచేస్తుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ పింఛన్ పెరుగుతుంది అన్నమాట.
తన నివేదికను ఎనిమిదవ వేతన సంఘం సమర్పించిన తర్వాత దానిని క్యాబినెట్ అమౌంట్ దించిన తర్వాత ఫైనల్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఏంటో అందరికీ తెలుస్తుంది. అయితే నిపుణులు అంచనా వేస్తున్న దాని ప్రకారం ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 నుండి 2.86 మధ్య ఉండవచ్చు అని తెలుస్తుంది. డిసెంబర్ 31, 2025న 7వ వేతన సంఘం ముగిసిపోతుంది. జనవరి ఒకటి, 2026 నుంచి కొత్త పెన్షన్ ప్రారంభం అవుతుందని అందరు భావిస్తున్నారు. వేతన సంఘం ఏర్పాటు అయిన సమయం నుంచి ఆ సూచనలు అమలు అవ్వడానికి దాదాపుగా ఒకటి నుంచి 1.5 సంవత్సరాలు పడుతుంది. జనవరి ఒకటి, 2026 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత పెన్షనర్లకు బకాయిలు అందే అవకాశం ఉంది.