Metpally : మెట్ పల్లి, మే30 (ప్రజా శంఖారావం): మున్సిపల్ కమిషనర్ పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ సైబర్ మోసగాళ్ల వలలో కొంత మంది బాధితులు మోసపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ డబ్బులు చెల్లించాలని మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్ కాల్స్ రావడంతో నిజమే అనుకొని కొంతమంది వ్యాపారస్తులు మోసగాళ్ళు పంపిన UPI scanner కి డబ్బులు పంపారు. తీరా అది ఫేక్ కాల్స్ అని తెలియడంతో బాధితులు తలలు పట్టుకున్నారు.
ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని 82 47 64 96 31 నెంబర్ తో గుర్తు లేని వ్యక్తులు పట్టణంలోని సుమారు 10 మందికి ఫోన్ చేశారు. దీంతో పలువురు డబ్బులు చెల్లించారు. మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్ లు రావడంతో కొందరు అనుమానంతో ఆరా తీశారు. దీంతో వచ్చిన కాల్స్ ఫేక్ అని తేలడంతో డబ్బులు చెల్లించిన బాధితులు తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఎవరైనా మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్లు చేస్తే డబ్బులు చెల్లించవద్దని కమిషనర్ మోహన్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.