Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: సందర్భం ఏదైనా కూడా మన దేశ మార్కెట్లో బంగారానికి మరియు వెండి కి చాలా డిమాండ్ ఉంటుంది. బులియన్ మార్కెట్లో కొన్నిసార్లు ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. గతంలో ఎన్నడు లేని విధంగా పసిడి లక్ష రూపాయలు దాటిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ గత వారం నుంచి పసిడి ధరలు తగ్గుదల కనిపిస్తుంది.

ఇటీవలే 98 వేలకు చేరిన తులం బంగారం ధర మళ్లీ 95 వేలకు చేరుకుంది. మళ్లీ కొన్ని రోజులలోనే 98 వేలకు తులం బంగారం ధర చేరుకుంది. తాజాగా ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తున్నాయి. మే 31, స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.97,320, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.89,210 గా ఉన్నాయి. తులం బంగారంపై పది రూపాయలు పెరిగింది. అలాగే ఈరోజు కిలో వెండి పై ₹100 తగ్గి ప్రస్తుతం కిలో వెండి రూ.99,800 గా ఉంది.

నేడు బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..

నేడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాలలో స్వచ్ఛమైన తులం బంగారం రేటు రూ.97,320, 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,210 గా ఉన్నాయి. అలాగే కిలో వెండి ధర రూ.1,10,800 గా ఉంది.

నేడు మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో స్వచ్ఛమైన తులం బంగారం రేటు రూ.97,470, 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,360 గా ఉంది. ఇక ఢిల్లీ నగరంలో కిలో వెండి ధర రూ.99,800 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now