December 13, 2024

Manager surrender as part of disciplinary action: క్రమశిక్షణ చర్యలో భాగంగా మేనేజర్ సరెండర్..?

Manager surrender as part of disciplinary action: ఆర్మూర్  టౌన్, నవంబర్ 22 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న హయ్యుమ్ ను మున్సిపల్ కమిషనర్ ఏ రాజు సిడిఎంఏ హైదరాబాద్ కు సరెండర్ చేస్తూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే గురువారం కమీషనర్ చాంబర్ లో ఇరువురు అధికారుల మధ్య వాగ్వివాదం జరిగి వ్యక్తిగత దూషణలతో పాటు అవినీతి ఆరోపణలతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న విషయం విధితమే. ఇందులో భాగంగా కిందిస్థాయి సిబ్బందితో పాటు ఉన్నత అధికారులతో విధుల పట్ల మేనేజర్ ఇస్టారీతిన వ్యవహరిస్తున్నందున క్రమశిక్ష చర్యలో భాగంగా ఆయనను సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులకు కమిషనర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అలాగే మేనేజర్ హయ్యుమ్ ఆర్ఓగా ఇన్చార్జి బాధ్యతలు చేసిన సమయంలో తప్పుడు ఇంటి నెంబర్లను ఇచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్నతాధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఇద్దరి అధికారుల మధ్య నెలకొన్న వాగ్వవాదం ఇప్పుడు మున్సిపల్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!