September 15, 2024
Big theft

Massive theft in the Nizamabad city: నగరంలో భారీ చోరీ..

Massive theft in the Nizamabad city: నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 03 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఐదో ఠాణ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు ఇంట్లో తాళాలు పగల కొట్టి 10 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ చెప్పారు. ఒకవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు పడి దోచుకెల్లడం స్థానికంగా భయాందోళన కలిగిస్తుందని కాలనీవాసులు వాపోయారు. రాత్రి సమయంలో కాలనీలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *