Fans Blood Donation: ఆర్మూర్ టౌన్, సెప్టెంబర్ 02 (ప్రజా శంఖారావం): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆయన అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన అభిమానులు రక్తదాన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరే ప్రవీణ్ కుమార్, కార్యకర్తలు ఆవుల వెంకటనారాయణ, వెంకటేశ్వర్లు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
Join Now