RBI ALERT: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో ఖాతా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు జమ చేసిన డబ్బును బ్యాంకులో పొదుపు చేయడానికి అలాగే లావాదేవీలు చేయడానికి బ్యాంకు ఖాతా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. గతంలో ప్రతి ఒక్కరు కూడా ఏది కొనాలన్నా నగదుతో డబ్బులు ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో అంతా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మనం ఉన్న ఈ రోజులలో బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఇప్పటివరకు బ్యాంకులో ఖాతా లేని వాళ్ళు కూడా బ్యాంకులలో ఖాతాలు తెరుస్తున్నారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాలో మే 31, 2025 నాటికి కొంత మొత్తాన్ని జమ చేయాలని ప్రకటించడం జరిగింది. బ్యాంకులో ఉన్న వారి ఎకౌంట్ కు సంబంధించి కేవైసీ పత్రాలు సమర్పించని వారిపై చర్యలు కూడా తీసుకుంటామని ఆర్బిఐ ప్రకటించింది. మే 31, 2025 నాటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తీసుకున్న లబ్ధిదారులు ఇకపై తమ పాలసీ ఎటువంటి ఆటంకం లేకుండా యధావిధిగా కొనసాగాలంటే వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్ లో లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో కనీసం రూ.436 ఉంచుకోవాలి.
ఇకపై ఆటో డెబిట్ విధానంలో ఈ డబ్బులు మీ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ చేయబడతాయి. తాజాగా ఆర్.బి.ఐ మే 1 లోపు తమ బ్యాంకు ఖాతాలలో ఈ డబ్బు జమ చేయని వారి పాలసీ రద్దు అవుతుందని కీలక ప్రకటన చేసింది. ఈ పాలసీ తీసుకున్న వారు ఏడాదికి ఒకసారి రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి వారికి మాత్రమే ఈ కొత్త నియమాలు వర్తిస్తాయని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ పాలసీ తీసుకున్న వారు ఏడాదికి ఒకసారి ఈ మొత్తాన్ని చెల్లించడం తప్పనిసరి.