RATION: రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెలిపారు. రేషన్ బియ్యం వద్దు అనుకుంటున్నా వారికి వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బులను వేస్తామని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీసెంట్గా కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దీనికి సంబంధించి ప్రకటన చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల నుంచే రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సర్కుల పంపిణీ ప్రారంభం అవుతుంది. రేషన్ సరుకులు వద్దు అనుకున్న వారికి డబ్బులు నేరుగా డి బి టి ద్వారా వారి బ్యాంకు ఖాతాలలో అందుతాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఇప్పటివరకు జరుగుతున్న రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకు మరియు వికలాంగులకు మాత్రం ఇంటికి బియ్యం సరుకులను డోర్ డెలివరీ చేస్తారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా చేయ్యేరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రేషన్ బియ్యం వద్దు అనుకున్న రేషన్ కార్డు లబ్ధిదారులు అందరు కూడా నగదు పొందవచ్చు అని తెలిపారు.
ఈ నగదును వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం స్వయంగా జమ చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. గత ప్రభుత్వం పాలనలో ఉన్న సమయంలో వాహనాల ద్వారా రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం పంపిణీ చేసేది. అయితే దీనికి ఖర్చు అధికంగా అవుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది.