Todays Gold Rate: ఈరోజు బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం లక్ష రూపాయలకు పైగా చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చిన బంగారం ధర 95 వేల వరకు తగ్గింది. మళ్లీ పసిడి ధరలు పెరుగుతున్నాయి. జూన్ 3 దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఏకంగా తులం బంగారంపై 1500 రూపాయల వరకు పెరిగింది.
ఈరోజు 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.98,850, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.90,610. ఈరోజు కిలో వెండి ధర రూ.1,00,100 గా ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనదిగా గుర్తించగలరు. ఈరోజు మొత్తంలో బంగారం ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ప్రాంతాలను బట్టి వీటి ధరలో వ్యత్యాసం కూడా ఉంటుంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం ధర రూ.90,760, 24 క్యారెట్ల తులం ధర రూ.99,000.
ముంబై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల తులం ధర రూ.90,610, 24 క్యారెట్ల తులం ధర రూ.98,850.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం ధర రూ.90,610, 24 క్యారెట్ల తులం ధర రూ.98,850 గా ఉంది.
అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక పరిణామాల కారణంగా మనదేశంలో కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. దీనిని కేవలం పెట్టుబడి సాధనంగా మాత్రమే కాదు మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగంగా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా మనదేశంలో పెళ్లిళ్ల సీజన్లో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు.