PETROL OFFERS: వాహనదారులకు మంచి అవకాశం ఇస్తున్న బంక్. వాహనదారులు 3 రూపాయలు పెట్రోల్ పై తగ్గింపు పొందవచ్చు. ప్రముఖ ప్రైవేట్ రంగా ఇంధన రిటైలింగ్ కంపెనీ అయిన నయారా ఎనర్జీ వాహనదారుల కోసం ఒక సరికొత్త స్కీము ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా వాహనాన్ని నడిపేవారు రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు వరకు లీటర్ పెట్రోల్ ధరపై తగ్గింపు పొందవచ్చు. జూన్ 30, 2025 వరకు మాత్రమే నయారా ఎనర్జీ అందిస్తున్న ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మనదేశంలో ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి.
అయితే క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా దిగి వస్తున్న కూడా మనదేశంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధరలు భారీగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో పెట్రోల్ ధరలను తగ్గించే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఇప్పుడు వాహనదారుల కోసం నయారా ఎనర్జీ ఒక కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. వాహనం నడిపే వారికి లీటర్ పెట్రోల్ ధరపై రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు తగ్గిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నయారా ఎనర్జీకి ఎంపిక చేసిన బ్యాంకులలో ఈ స్కీం ద్వారా లీటర్ పెట్రోల్ పై వాహనదారులకు మూడు రూపాయలు తగ్గింపు అందిస్తుంది. వాహనాదారులు కొట్టిస్తున్న పెట్రోలు పై తగ్గింపు ఆధారపడి ఉంటుంది. తాజాగా నయారా ఎనర్జీ తమ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్ల కోసం మహా బచత్ ఉత్సవ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. నయారా ఎనర్జీ ద్వారా ఎంపిక చేసిన బ్యాంకులలో వాహనాదారులకు లీటర్ పెట్రోల్ పై మూడు రూపాయలు తగ్గింపు అందిస్తుంది.