UPI New Features: రోజురోజుకీ మనదేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు అనేక మార్పులను చేస్తుంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులలో ముందున్న దేశాలలో మన దేశం కూడా ఒకటి. మనదేశంలో రోజురోజుకు యూపీఐ వాడకం గననీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా యూపీఐతో క్షణాలలో డబ్బు పంపించగలిగే అవకాశం అందరిని ఆకర్షిస్తుంది. కొన్ని కొన్ని సార్లు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్న సమయంలో తప్పుడు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. యూపీఐ లో కేవలం ఒక్క నెంబర్ తప్పుగా పడినా కూడా వేరే వారి ఖాతాల్లోకి ఆ డబ్బులు పడతాయి.
తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త నియమాన్ని అమలు చేయబోతుంది. తప్పుడు ట్రాన్సాక్షన్స్ లో నివారించడంలో ఇది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది అని తెలుస్తుంది. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారు ఫోన్లో సేవ్ చేసుకున్న నెంబర్ ఆధారంగా చేస్తారు. ప్రస్తుతం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ తీసుకుని వచ్చిన కొత్త నిబంధన ద్వారా మీరు డబ్బులు పంపుతున్న సమయంలో లావాదేవీ స్క్రీన్ పై మీకు ఖాతాదారుడి అసలైన పేరు కూడా కనిపిస్తుంది. బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆధారంగా మీకు ఈ పేరు కనిపిస్తుంది.
మీరు డబ్బులు పంపాలనుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా ఏ పేరు మీద ఉందో ఆ పేరు మీకు ట్రాన్సాక్షన్ చేస్తున్న సమయంలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ క్రమంలో మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో తెలుసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం ద్వారా తప్పుడు ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. పర్సెన్ టు పర్సన్ అలాగే పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్స్ కు ఈ మార్పు వర్తిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా మీరు సరైన వ్యక్తికి మాత్రమే డబ్బులను పంపించవచ్చు.