Vastu Tips: ఇంట్లో తులసి, శంఖం ఈ దిశలో పెట్టడం వలన చాలా శుభాలు జరుగుతాయి.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ఇల్లు ఎంత అందంగా ఉన్నా కూడా కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితం కూడా ఉరుకులు పరుగులతో సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మానసింగా అలసిపోతున్నారు. పని ఒత్తిడి, సామాజిక మాధ్యమాలలో కార్యకలాపాలు, సమాజంలో పెరుగుతున్న పోటీ ఇలా అనేక కారణాల వలన మానసికంగా ప్రశాంతత ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు యోగ, ధ్యానం వంటిని అలవాటు చేసుకుంటున్నారు. మానసిక ఆరోగ్యం అలాగే శాంతి విషయంలో ఇంటి వాస్తు కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరిగే కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత కలగాలంటే ఆ ఇంట్లో తులసి, శంఖాన్ని సరైన దిశలో పెట్టుకోవడం చాలా అవసరం.

ఇంట్లో తులసి మరియు శంఖాన్ని వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన దిశలో పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రశాంతత ఉంటుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. తులసి మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం మానసిక ప్రశాంతతకు అలాగే సానుకూలతకు చిహ్నంగా చెప్తారు. వాస్తు శాస్త్రం కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, ప్రతిదీసా అలాగే ప్రతి మూలకు కూడా ఒక నిర్దిష్ట శక్తితో ముడిపడి ఉన్నాయని చెప్తుంది. వాస్తు శాస్త్రంలో ముఖ్యంగా తులసి మొక్కకు మరియు శంఖానికి చాలా ప్రత్యేకత ఉంది.

ఇంట్లో వీటిని సరైన దిశలో పెట్టడం వలన ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి మానసిక ప్రశాంతత అలాగే సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కను ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో పెట్టడం చాలా శుభప్రదంగా చెబుతారు. తులసి మొక్క ఇంట్లో గాలినే శుద్ధి చేయడమే కాకుండా ఆ తులసి మొక్క దగ్గర కూర్చోవడం వలన మనసుకు కూడా చాలా ప్రశాంతత కలుగుతుంది. శంఖాన్ని ఊదినపుడు వచ్చే శబ్దం ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కాబట్టి ఇటువంటి శంఖాన్ని ఇంట్లో పూజ గదిలో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా శుభప్రదం.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now