Metpally: మెట్ పల్లి/మల్లాపూర్, మే 30 (ప్రజా శంఖారావం): పొలం దున్ను తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి బావిలోని నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now