Police: నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 7 (ప్రజా శంఖారావం): తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సిపిగా పనిచేసిన కల్మేశ్వర్ ఐదు నెలల క్రితం హైదరాబాదులోని ట్రైనింగ్ సెంటర్ కు బదిలీ అయినప్పటి నుండి జిల్లాలో ఇన్చార్జి సిపి పాలన కొనసాగింది. 2016 బ్యాచ్ కు చెందిన సాయి చైతన్య యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పని చేస్తూ, తాజాగా ప్రభుత్వం బదిలీ చేసిన ఐపీఎస్ అధికారులలో నిజామాబాద్ జిల్లా సిపిగా అయన నియమితులయ్యారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now