Govt Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆటోలు మరియు ఎలక్ట్రిక్ బైక్లు ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఏపీ ప్రభుత్వం ఒకవైపు ఖజానాలో డబ్బు లేదంటూనే మరోవైపు ప్రజల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. చేతల్లో సంక్షేమ పాలనను చూపిస్తుంది. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం ప్రధాన నగరాల్లోని డ్వాక్రా మహిళలకు ఆటోలు మరియు ఎలక్ట్రిక్ బైక్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టింది.
ప్రతినెల పెన్షన్ ఇవ్వడానికి సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కి సీఎం చంద్రబాబు వెళ్ళబోతున్నారు. ప్రభుత్వం అక్కడ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సమాచారం. ఆ సభలో సీఎం చంద్రబాబు తానే స్వయంగ మహిళా రైడర్లకు 10 బైకులు మరియు 10 ఆటోలు ఇస్తారని తెలుస్తుంది. ఏపీలోని వివిధ జిల్లాలలోని 8 నగరాల్లో 1000 వాహనాలను రైడర్లకు అందించనున్నారు. వీటిని మహిళలు టాక్సీ సర్వీసుల లాగా నడుపుతారు. అలా చేయడం వలన మహిళలకు రోజు ఆదాయం అందుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాపిడో తో డీల్ కుదురుచుకున్నట్లు తెలుస్తుంది.
మహిళా రైడర్లు 1000 ఆటలు మరియు ఎలక్ట్రిక్ బైక్ సర్వీసులను రాపిడో సంస్థ ద్వారా అందిస్తారు. నగరంలో ఎవరైనా రాపిడో ద్వారా ఆటో లేదా ఈ బైక్ బుక్ చేసుకున్నట్లయితే మహిళా రైడర్లు డ్రై చేస్తూ వాళ్లను గమ్యస్థానాలకు తీసుకెళ్తారు. ఇలా మహిళలు ఆదాయం పొందగలుగుతారు. ఈ క్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలో 400, విశాఖపట్నంలో 400 బైక్లు మరియు ఆటోలను మహిళలకు అందిస్తుంది. ఇది సక్సెస్ అయితే గనుక మనం భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకా ఎక్కువ మందికి ఇలా ఇవ్వాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వలన వెయ్యి కుటుంబాలకు ఆదాయం వస్తుంది.