TOOL PLAZA: రోడ్డు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఇకపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వారి ప్రయాణం మరింత సులభంగా జరిగేలాగా టోల్ వసూల్ అయ్యేలాగా ఇటీవలే సాటిలైట్ విధానం అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం నగదుతో మాత్రమే టోల్ వసూలు జరిగేది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 15, 2019 న టోల్ కేంద్రాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొని వచ్చింది. ప్రస్తుతం సాటిలైట్ ద్వారా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై అలాగే తెలంగాణలో పతంగి, కోర్లపహాడ్ ఇక ఆంధ్రప్రదేశ్లో చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర వసూలు చేస్తున్నారు.
ఈ టోల్ కేంద్రాల దగ్గర వాహనం ఆగవలసిన అవసరం లేకుండానే సాటిలైట్ విధానం ద్వారా వసూలు అవుతుంది. వాహనదారులు తమ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ లేకపోయినా కూడా టోల్ కేంద్రాల దగ్గర చెల్లింపు ఎలా జరుగుతున్నాయి అంటూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గట్కరి జిపిఎస్ ఆధారిత వ్యవస్థను వాహనా దారిలో ప్రయాణించిన దూరం మేరకే నేషనల్ హైవేలపై టోల్ వసూలు చేసేందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో ఈ విధానాన్ని ట్రయల్ రన్ చేసే ఆలోచనలో ఉంది.
ఎన్ హెచ్ ఏ ఐ త్వరలో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై కూడా ఈ విధానాన్ని ట్రయల్ రన్ చేపట్టనున్నారని ఈటీవీ భారత్ కు ఓ అధికారి వివరించారు. ఈ క్రమంలో ఇక త్వరలో సాటిలైట్ విధానం హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే కూడా ప్రారంభం కానుంది అని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే త్వరలో వాహనాదారులు ఈ టోల్ కేంద్రాల వద్ద ఆగకుండానే వాహనాల టోల్ వసూలు అవుతుంది. ఇకపై వాహనదారులు ఈ టోల్ కేంద్రాల దగ్గర క్యూలో టోల్ రుసుము కట్టాల్సిన అవసరం లేదు.